

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటూ తన కెరీర్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు ప్రముఖులతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న హీరోగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గతంలో లైగర్ చిత్రంలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌తో కలిసి నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు విజయ్ నటిస్తున్న రణబాలి చిత్రంలో ది మమ్మీ ఫ్రాంచైజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. దీంతో ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో కలిసి నటించిన అరుదైన రికార్డు విజయ్ ఖాతాలో చేరినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!