
జనరల్

టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె, ఇటీవల తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత తాజాగా తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు జిమ్‌లో చేసిన వర్కవుట్స్‌ను ఈ వీడియోలో చూపించారు.
ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన ఫిట్‌నెస్‌పై ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి ‘#9 The Final Lap’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సమంత ఫిట్‌నెస్ పట్ల చూపిన ఆసక్తిని ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!