
రాజకీయాలు

తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి భూ రికార్డుల వ్యవస్థపై ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు సిద్ధమైంది. ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ధరణి అమలు సమయంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఈటీ)ని ఏర్పాటు చేసింది.
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ లావాదేవీలు, రికార్డుల మార్పులు, అక్రమ మ్యూటేషన్లు, భూ వివరాల తారుమారుపై ఎస్‌ఈటీ పరిశీలన చేపట్టనుంది. అవసరమైతే మాజీ ఉన్నతాధికారులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ధరణి అమలులో జరిగిన అవకతవకలను వెలికితీసి, భూముల యాజమాన్య సమస్యలకు పరిష్కారం చూపడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!