
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంగీత దర్శకుడు రమణ గోగులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ చిత్రాలకు రమణ గోగుల అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన గుర్తు చేశారు.
రమణ గోగుల ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్, అమెరికాలో ఎంఎస్ చేసిన విద్యావంతుడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమా రంగంతో పాటు వెంచర్ క్యాపిటలిస్టుగా, టెక్నాలజీ రంగంలో కూడా ఆయన విజయవంతంగా రాణిస్తున్నారని తెలిపారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!