

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ‘కైండా చిక్’ ట్రెండ్‌లో భాగమయ్యారు. తన జీవితంలో తనకు ప్రత్యేకంగా, స్టైలిష్‌గా అనిపించే కొన్ని విషయాలను ఫొటోలతో పంచుకున్నారు. 30 ఏళ్ల వయసులో జీవితాన్ని కొత్తగా ప్రారంభించడం, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖండాలు దాటి వెళ్లడం, ఇతరులు తనను తక్కువగా అంచనా వేయడం వంటివి తనకు ‘చిక్’గా అనిపిస్తాయని తెలిపారు. మెట్ గాలాలో తన భర్తను కలవడం, వివరణ ఇవ్వకుండా ‘నో’ చెప్పగలగడం, ఇస్రో మెయిలింగ్ లిస్ట్‌లో ఉండటం కూడా తనకు ప్రత్యేకమైన విషయాలని పేర్కొన్నారు.
తన వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా ప్రియాంక పంచుకున్నారు. తన బాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోవడం, తన ప్రాణ స్నేహితురాలి బిడ్డతో తన బిడ్డకు స్నేహం ఏర్పడటం, ఓ చిన్నారికి సురక్షితమైన ప్రపంచాన్ని అందించడం వంటి విషయాలను కూడా ‘చిక్ మూమెంట్స్’గా పేర్కొన్నారు. సినిమాల విషయానికొస్తే, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేశ్ బాబు సరసన ‘మందాకిని’గా కనిపించనున్న ఆమె. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!