

టాలీవుడ్, కోలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. మహాభారతంలోని ప్రముఖ వీరుడు కర్ణుడి కథ ఆధారంగా మహావీర్ కర్ణ పేరుతో పాన్ ఇండియా హిస్టారికల్ డ్రామాను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రను రాఘవ లారెన్స్ పోషించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో కర్ణుడి పాత్రలో లారెన్స్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.
ఖిలాడి, రాక్షసుడు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రమేష్ వర్మ ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు. నటుడు, దర్శకుడికి ఇది విభిన్నమైన జానర్‌లో రూపొందుతున్న చిత్రంగా నిలవనుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మహావీర్ కర్ణ చిత్రాన్ని 2027లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!