
సినిమాలు

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దర్శకుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబర్ నాటికి ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే చిత్రంలోని ప్రధాన భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!