

పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందిన ప్రేమ, శుభాకాంక్షలకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఉద్దేశించి ప్రత్యేక సందేశం ఇచ్చారు. అభిమానులు చూపించే ప్రేమే తన బలమని, వారి అభిమానం తనను ఎంతో అదృష్టవంతుడిగా భావించేలా చేస్తోందని పేర్కొన్నారు. అభిమానుల కోసం మరింత కష్టపడి పనిచేస్తానని, వారిని మరింత గర్వపడేలా చేస్తానని చెప్పారు.
తన తదుపరి చిత్రం ‘వారణాసి’ గురించి కూడా మహేశ్‌బాబు ఆసక్తికరంగా స్పందించారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ చిత్రబృందం రుద్ర పాత్రలో మహేశ్‌బాబు లుక్‌ను చూపిస్తూ రెండు ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసింది. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్‌లో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!