

నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి తాజాగా వెల్లడించారు. నేహా ధూపియా, అంగద్ బేడీ నిర్వహిస్తున్న డబుల్ డేట్ టాక్ షోలో భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్, జిమ్‌లో సేఫ్టీ బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించగా తీవ్రమైన స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని చెప్పారు. ఆ గాయం కారణంగా దాదాపు 40 రోజుల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు.
ఆ ప్రమాదం తనను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా కుంగదీసిందని రకుల్ వెల్లడించారు. నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చిందని చెప్పారు. డెడ్‌లిఫ్ట్ వంటి వ్యాయామాలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని, భద్రతను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. క్లిష్ట సమయంలో తన భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచి ధైర్యం చెప్పారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!