

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 3న ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై తొలి నాలుగు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. వీకెండ్ తర్వాత కూడా స్థిరమైన కలెక్షన్లతో ప్రేక్షకాదరణను కొనసాగిస్తూ ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

తాజాగా వారం రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹345 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!