

చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ భద్రత కోసం అమెరికా చేస్తున్న ఖర్చులను, దాని వల్ల ప్రయోజనం పొందుతున్న దేశాలు తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి సహాయం తీసుకోకుండానే హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు అమెరికా భద్రత కల్పిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రయత్నాల వల్ల ప్రయోజనం పొందుతున్న దేశాలు యుద్ధం ముగిసిన తర్వాత పరిహారం చెల్లించాలని అన్నారు.
మరోవైపు ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. టెహ్రాన్ త్వరగా ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని, అమెరికా కూడా చర్చలకు సిద్ధంగానే ఉందని ఆయన తెలిపారు. అయితే తుది నిర్ణయం మాత్రం అమెరికాదేనని స్పష్టం చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!