

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల ముంబైలో వీరిద్దరూ కలుసుకోవడంతో త్వరలోనే కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ భేటీతో ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. మరోవైపు అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే చర్చ కూడా చాలాకాలంగా కొనసాగుతోంది.
పుష్ప, రాకా వంటి ప్రాజెక్ట్‌లకు సుదీర్ఘ సమయం కేటాయించిన నేపథ్యంలో ఇకపై సినిమాల వేగాన్ని పెంచాలని అభిమానులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కెరీర్లో మంచి జోరులో ఉన్న సమయంలో వరుసగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమాను కూడా లైనప్‌లో పెట్టే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడం ద్వారా విడుదలల మధ్య గ్యాప్‌ను తగ్గించాలని ఆయన భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!