
జనరల్

తిరుమలలో చాలారోజుల తర్వాత భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. బ్రహ్మోత్సవాల సమయంలోనూ రద్దీ తక్కువగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంపార్ట్‌మెంట్లలో ఎలాంటి నిరీక్షణ లేకుండానే భక్తులను నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి వెళ్లే భక్తులకు కూడా దాదాపు 4 గంటల సమయం పడుతుందని పేర్కొంది.
సోమవారం స్వామివారిని 88,210 మంది భక్తులు దర్శించుకోగా, 30,192 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రూ.4.23 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సమయంలో సాధారణంగా కనిపించే రద్దీతో పోలిస్తే ప్రస్తుతం భక్తుల సంఖ్య తగ్గడం చర్చనీయాంశంగా మారింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!