

భారతీయ సినీ పరిశ్రమ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘రామాయణ’ ఒకటి. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను జూలై 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే సమయంలో ట్రైలర్ రన్‌టైమ్‌కు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ట్రైలర్‌ను సుమారు 4 నిమిషాల నిడివితో రూపొందించారని తెలుస్తోంది. విజువల్ వండర్‌గా నిలిచేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించినట్లు సమాచారం. అంతేకాకుండా ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు ‘U’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పుడు ఎదురైన విమర్శల తర్వాత ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ‘రామాయణ’ విషయంలో కూడా అదే తరహా స్పందన వస్తే సినిమా అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే జూలై 24 వరకు వేచి చూడాల్సిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!