

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 1970ల నాటి వింటేజ్ కారును డ్రైవ్ చేస్తూ రణ్‌బీర్ కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో ఆయన ఎడమ చేయి రక్తంతో తడిసి ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భన్సాలీ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, లవ్ అంశాల కలయికగా ఉండనున్నట్లు పోస్టర్ సూచిస్తోంది.
విదేశీ నేపథ్యంతో దేశ రక్షణ కోసం పోరాడే ఇద్దరు ఆర్మీ అధికారుల కథగా ‘లవ్ అండ్ వార్’ తెరకెక్కుతున్నట్లు సమాచారం. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతూనే.. అలియా భట్ పాత్ర కోసం ఇద్దరు సైనికుల మధ్య సాగే ఘర్షణ, భావోద్వేగాలు కథలో కీలకంగా ఉండనున్నాయి. ‘యానిమల్’తో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించిన రణ్‌బీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!