

నటి రష్మిక మందన్న, ప్రస్తుతం రష్మిక దేవరకొండగా గుర్తింపు పొందుతున్న ఆమె, నిరుపేద కుటుంబాలకు ఆహార సహాయం అందించేందుకు ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘రణబాలి’ సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ కార్యక్రమం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో 400 కుటుంబాలకు నిత్యావసర ఆహార సరుకులను అందిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, అనంతపురం, బెంగళూరు, కొచ్చి, చెన్నై, కొడగు, విజయవాడ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ప్రతి కుటుంబానికి అందించే కిట్లో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 15 కిలోల మిశ్రమ పప్పులు, 10 లీటర్ల వంట నూనెతో పాటు రాగులు, మసాలా దినుసులు, టీ పొడి ఉన్నాయి. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరిస్తూ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రణబాలి’లో తాను పోషించిన జయమ్మ పాత్రకు, తనకు కొన్ని పోలికలు ఉన్నాయని, ఇతరులకు సహాయం చేయడం వాటిలో ఒకటని తెలిపారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. రష్మిక చేపట్టిన ఈ కార్యక్రమంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!