
రాజకీయాలు

పెళ్లి అనేది సమాజం నిర్ణయించిన నియమాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ప్రముఖ నటి రష్మిక మందన్న అన్నారు. భాగస్వాములు ఎలా కోరుకుంటే అలా ఉండే బంధమే నిజమైన పెళ్లి అని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఇష్టాలు, పరస్పర అవగాహన, ఆనందమే ముఖ్యమని చెప్పారు.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జెన్-జీ యువతలో కొందరు పెళ్లిని పాత ఆలోచనగా భావిస్తున్నారని రష్మిక పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల పెళ్లికి సంబంధించిన వయస్సు, సమయం వంటి అంశాలపై సమాజం కఠినమైన అంచనాలు పెట్టడం వల్లే అలాంటి భావనలు వస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. పెళ్లి, సంబంధాలు వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా ఉండాలని ఆమె అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!