

దేవుడిపై నమ్మకం ఉన్నవాళ్లు ఉన్నట్లే.. నమ్మకం లేని వాళ్లు కూడా ఉంటారు. ఎవరి విశ్వాసాలు వారివే. అయితే కొన్ని సందర్భాల్లో విధి అనూహ్యంగా మలుపు తిప్పుతుంది. తాజాగా రవితేజ విషయంలోనూ ఇదే ఆసక్తికరంగా మారింది. రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’లో అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని కథకు జోడించగా, ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అయ్యప్ప భక్తుడిగా రవితేజ కనిపించిన తీరు, సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే గతంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల సమయంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవితేజ తనకు సంప్రదాయ పూజలు, దేవుడి విగ్రహాల ఆరాధనపై పెద్దగా విశ్వాసం లేదని చెప్పినట్లు సమాచారం. ప్రకృతినే దేవుడితో సమానంగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి నేపథ్యంతో తెరకెక్కిన ‘ఇరుముడి’ విజయవంతం కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!