

నటి సమంత ఇటీవల తన బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలకు స్పందించారు. తాను కావాలనే డైటింగ్ చేసి సన్నగా కాలేదని, మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం గతంతో పోలిస్తే తాను కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆహార విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా కామెంట్లు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
ఇక తన పెంపుడు పిల్లికి ‘జెలాటో’ అనే పేరు పెట్టడం వెనక ఉన్న కారణాన్ని కూడా సమంత వివరించారు. మయోసైటిస్ చికిత్స సమయంలో రెండేళ్ల పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సి వచ్చిందని, వైద్యులు అనుమతించిన తొలి ఆహార పదార్థాల్లో జెలాటో ఐస్క్రీమ్ ఒకటని చెప్పారు. ఆ ఐస్క్రీమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేదానినని, అందుకే తన పెంపుడు పిల్లికి అదే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!