
గాసిప్స్

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం లెనిన్ గురువారం ఘనంగా విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల అఖిల్ సమంత గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు అదే సినిమాపై సమంత స్పందించడం మరింత క్యూరియాసిటీని పెంచుతూ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లెనిన్ ట్రైలర్‌ను షేర్ చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ, ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మొత్తం టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!