

ప్రముఖ నటి సమంత తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్ ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస విజయాలు, ప్రేక్షకుల అభిమానంతో తాను స్టార్‌డమ్ మత్తులో కొట్టుకుపోయానని, ఒక దశలో అహంకారం కూడా పెరిగిందని ఆమె తెలిపారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిన్న పట్టణం నుంచి వచ్చిన తనకు స్టార్‌గా ఎదగడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు.
అయితే 2022లో మయోసైటిస్ వ్యాధితో బాధపడిన తర్వాత తీసుకున్న విరామం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. కెరీర్‌కు కూడా ఒక ముగింపు ఉంటుందని అర్థమైందని, అదే తన ఆలోచనా విధానాన్ని మార్చిందని వెల్లడించారు. గతంలో సంవత్సరానికి పలుసినిమాలు చేస్తూ అంచనాల ఒత్తిడిలో జీవించానని, ఇప్పుడు మాత్రం మరింత సమతుల్య దృక్పథంతో సినిమాలను ఎంపిక చేసుకుంటున్నానని సమంత పేర్కొన్నారు. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!