

టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గర్భధారణ సమయంలోనూ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గర్భధారణ సమయంలో తన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విధానం ఎలా మారిందో అభిమానులతో పంచుకున్నారు. అయితే తాను చేస్తున్న వ్యాయామాలన్నీ వైద్యుల సలహా మేరకే చేస్తున్నానని, ఇవి తన వ్యక్తిగత అనుభవాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
తన శక్తిలో 70 శాతం మాత్రమే వినియోగించినప్పుడు వర్కౌట్ ఎలా ఉంటుందో వీడియో ద్వారా చూపించారు. కొన్ని రోజులు శరీరం మరింత బలంగా అనిపిస్తుందని, మరికొన్ని రోజుల్లో వ్యాయామాలను మార్చుకుంటానని తెలిపారు. శరీరాన్ని ఒత్తిడికి గురిచేయడం కంటే, శరీరం చెప్పే సంకేతాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని సమంత పేర్కొన్నారు. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం, వర్కౌట్ విధానంలో మార్పులు చేసుకోవడం కూడా ఫిట్‌నెస్‌లో భాగమేనని చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!