

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

వీకెండ్‌తో పాటు టికెట్ ధరలు కూడా తగ్గించడంతో ప్రేక్షకుల ఆదరణ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వారాంతంలోనే 'మా ఇంటి బంగారం' రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరుతుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!