

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'మాతృభూమి' సినిమా మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో, గాల్వాన్ ఘర్షణల చిత్రీకరణపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్తలపై ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా సెన్సార్, విడుదలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిధిలోనే ఉంటాయని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!