
గాసిప్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బెల్జియానికి చెందిన ఆంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (AWDC) రూ.21 లక్షలకు పైగా విలువైన వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కానుకను అందజేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. గతంలో ఖతార్ ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన విమానాన్ని కానుకగా అందుకున్న ట్రంప్‌కు ఇది మరో ఖరీదైన బహుమతిగా నిలవనుంది.
బెల్జియం నుంచి అమెరికాకు ప్రతి సంవత్సరం సుమారు రూ.16,800 కోట్ల విలువైన పాలిష్ చేసిన వజ్రాలు ఎగుమతి అవుతున్నాయని AWDC తెలిపింది. ఆ వజ్రాలపై అమెరికా విధించిన టారిఫ్‌లను తొలగించిన నిర్ణయానికి కృతజ్ఞతగా ఈ వజ్రాల ఉంగరాన్ని ట్రంప్‌కు అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!