

ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సంపూర్ణేశ్ బాబు, జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మధ్య జరిగిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇంటర్వ్యూలో సినీ నేపథ్యం లేకపోయినా పరిశ్రమలోకి ఎందుకు వచ్చారంటూ నాగేంద్ర కుమార్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్యపై నెటిజన్లు, సంపూర్ణేశ్ బాబు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నటుడిని అలా ప్రశ్నించడం సరికాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
వివాదం నేపథ్యంలో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, సంభాషణలో భాగంగా అనుకోకుండా అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. అనంతరం సంపూర్ణేశ్ బాబు కూడా ఈ వ్యవహారంపై స్వయంగా వీడియో ద్వారా స్పందించారు. నాగేంద్ర కుమార్ తనకు ఎంతో సన్నిహితుడని, హృదయ కాలేయం సినిమా రోజుల నుంచి జర్నలిస్టులు తనను సోదరుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆ వ్యాఖ్యలు వచ్చాయని, వాటిని ఎవరూ మరో విధంగా అర్థం చేసుకోవద్దని అభిమానులను కోరారు. సంపూర్ణేశ్ బాబు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!