
జనరల్

బాలీవుడ్‌లో ఒకప్పుడు కనిపించిన కుటుంబ వాతావరణం, పరస్పర సహకారం ఇప్పుడు కనిపించడం లేదని ప్రముఖ నటుడు సంజయ్ దత్ అన్నారు. తన సినీ ప్రయాణం ప్రారంభమైన రోజుల్లో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండేవారని, ఒకరికి ఒకరు అండగా నిలిచేవారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
హాలీవుడ్‌తో పోల్చుతూ మాట్లాడుతూ, అక్కడ ఇప్పటికీ ఆరోగ్యకరమైన పోటీతో పాటు పరస్పర గౌరవం కొనసాగుతోందని సంజయ్ దత్ చెప్పారు. అక్కడ అసూయకు పెద్దగా చోటు ఉండదని, కానీ బాలీవుడ్‌లో ఇప్పుడు ఎవరి ప్రయాణం వారిదే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!