

బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ నటించిన తాజా చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు. ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద వేగంగా పుంజుకుంది. ముఖ్యంగా రెండో వారాంతంలో వసూళ్లు పెరగడంతో పలు ప్రాంతాల్లో థియేటర్లలో అదనపు షోలు, స్క్రీన్లు పెంచారు.
సినిమా విజయంపై స్పందించిన శార్వరీ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ఎంతో ప్రేమతో చేసిన ఒక పని ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు కలిగే ఆనందం అమూల్యమని ఆమె పేర్కొన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న సందేశాలు, వీడియోలు, భావోద్వేగ స్పందనలు తనను కదిలించాయని తెలిపారు. సినిమాను ఇంతగా ఆదరించి, చిత్రబృందానికి మద్దతుగా నిలిచిన ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ, అభిమానమే ఈ విజయానికి ప్రధాన కారణమని శార్వరీ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!