

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో అనిల్ కపూర్ కూడా పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. 1960ల నాటి అఫీమ్ వ్యాపార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, అనిల్ కపూర్ భారత నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, అనిల్ కపూర్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అనిల్ కపూర్ గతంలో ‘వంశ వృక్షం’ (1980)లో నటించగా, దాదాపు 46 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ తెలుగు సినిమాలో కనిపించనుండటం ప్రత్యేకతగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!