

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈఠా చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లవానీ కళాకారిణి విఠాబాయి భావూ జీవిత కథను తెరపై ఆవిష్కరించనున్నారు. రంగస్థలంపై తన అద్భుత అభినయం, జానపద కథల ప్రదర్శన, లయబద్ధమైన నృత్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన విఠాబాయి భావూ మరాఠీ సంప్రదాయ కళ ‘లవానీ’కి విశేష గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఛావా చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా విడుదలైన శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరాఠీ సంప్రదాయ వస్త్రధారణలో ఆమె కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!