
బిజినెస్

హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాసిప్’ చిత్రం నుంచి తాజాగా ‘సిప్పు సిప్పు’ అనే డాన్స్ నంబర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు, అందమైన ప్రేమకథ మరియు సామాజిక వ్యంగ్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ పాటకు శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని రాశారు. సింగర్ మాళవిక తన గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. ఒక మధ్యతరగతి యువతి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!