
టెక్నాలజీ

‘వృషకర్మ’ గ్లింప్స్ విడుదలై దాదాపు ఆరు నెలలు కావస్తోంది. కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్లింప్స్‌తో మంచి బజ్ ఏర్పడటంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆ తర్వాత నుంచి చిత్రబృందం నుంచి పెద్దగా అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు తదుపరి ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వీఎఫ్‌ఎక్స్ పనులు సకాలంలో పూర్తయితే దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ విడుదలపై అధికారిక క్లారిటీ లేకపోవడంతో ఆ ప్లాన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘వృషకర్మ’తో నాగ చైతన్య బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!