
సినిమాలు

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తనను 'పనికిరాని వాడు', 'నిరుద్యోగి' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఘాటుగా స్పందించారు. తనపై కంగనా ఎందుకు అంత తీవ్రంగా స్పందించారో అర్థం కావడం లేదని పేర్కొంటూ, ఈ విషయంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
తన స్నేహితుల్లో ఒకరు 'నువ్వు చిన్నప్పటి హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నావేమో.. అందుకే కంగనా అలా స్పందించి ఉండొచ్చు' అని మెసేజ్ చేశారని సౌరవ్ దాస్ తెలిపారు. ఆ వ్యాఖ్యపై తాను ఆశ్చర్యపోయానని, అది నిజమేనా అని సరదాగా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!