

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో సినిమాపై కొంత అయోమయం నెలకొంది. అంతర్జాతీయ మాఫియా నేపథ్యంలో కథ సాగుతుందని, కొరియన్ స్టార్ డాన్ లీ కీలక పాత్రలో కనిపిస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ సినిమా పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగే స్థానిక పోలీస్ కథ అని నిర్మాత స్పష్టం చేయడంతో ఆ అంచనాలకు బ్రేక్ పడింది. భారీ బడ్జెట్‌కు బదులుగా తక్కువ ఖర్చుతో సినిమాను, క్వాలిటీగా తెరకెక్కిస్తున్నారని టాక్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రభాస్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది.
సినిమాలో భారీ ట్విస్ట్ ఉండబోతుందనే వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా చూపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తనదైన టేకింగ్‌తో స్థానిక పోలీస్ కథను ఎంతటి స్థాయిలో తెరకెక్కిస్తారనేది కీలకంగా మారింది. కథలోని యాక్షన్, పాత్రల చిత్రణ, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నదే విజయాన్ని నిర్ణయించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!