

తెలుగు సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధ త్వరలో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘మైత్రీ ఇన్ లవ్’ అనే రొమాంటిక్ లవ్‌స్టోరీతో ఆమె కథానాయికగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో జై జాస్తి, మేధ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రేమకథకు సంబంధించిన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కథానాయకుల ప్రయాణం మొదలై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రేమకథగా సినిమాను చిత్రబృందం పరిచయం చేసింది.
మేధకు వెండితెర కొత్త కాదు. గతంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాలో ఆమె చిన్నప్పటి రుద్రమదేవి పాత్రను పోషించారు. ఇప్పుడు హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో ఆమె నటనపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా హీరోగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏమో ఏమో ఇది’ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అన్నాచెల్లెళ్లిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!