

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం రోడ్ టు రీలోడ్ ముగిసింది. ఈ వారం అపూర్వ, చరణ్ మహాదేవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, శివ్, దక్ష, నీతూ మాస్టర్, శ్వేతా నాయుడు, రామకృష్ణ కొత్త కంటెస్టెంట్లుగా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఎలిమినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన చరణ్, హౌస్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. హౌస్‌మేట్స్ ఓటింగ్ కారణంగానే తాను రెండోసారి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రేక్షకుల ఓట్లతో తిరిగి హౌస్‌లోకి వచ్చినప్పటికీ, చివరకు ఇంటి సభ్యుల నిర్ణయంతో ఎలిమినేట్ అయ్యానని చెప్పారు. తన ప్రయాణం బాగానే సాగిందని, ఆడిషన్స్ సమయం నుంచి తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. హౌస్‌లో కామనర్స్, సెలబ్రిటీల మధ్య విభజన కనిపించిందని, ఓటింగ్ సమయంలో ప్రతి వర్గం తమ వారికే మద్దతు ఇస్తున్నట్లు అనిపించిందని పేర్కొన్నారు.
తన ఎలిమినేషన్‌కు హౌస్‌మేట్స్ బలమైన కారణాలు చెప్పలేదని, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగిందని చరణ్ వెల్లడించారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు షాలినిని టార్గెట్ చేయడం చూసి, ఆమె బయట నెగెటివిటీ ఎదుర్కొంటోందని హౌస్‌మేట్స్ భావించి ఉండొచ్చని, అందుకే ఆమెను ఉంచి తనను ఎలిమినేట్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తాను అనవసర గొడవలు, డ్రామాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో ఆడానని చెప్పారు. త్రిగుణ్ ఆటతీరును ప్రశంసిస్తూ, షోలో తన ఉనికిని చాటుకోవడంలో ఆయన సఫలమయ్యారని పేర్కొన్నారు. రోహిత్, త్రిగుణ్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని, అయితే తమ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. ముఖేష్ గౌడ ఆటిట్యూడ్, దేబ్జానీ మోదక్ వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడిన చరణ్, చివరగా తనకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!