

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ వన్ విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. అదే సమయంలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన పాటలు, ముఖ్యంగా ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి’ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
చిత్రానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా నటుడు రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘సత్య’ పాత్ర తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌లో మరచిపోలేని అధ్యాయంగా నిలిచిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా తర్వాతే నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకున్నానని తెలిపారు. తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి, కీరవాణికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ ప్రేక్షకులు తనను ‘సత్య’ పేరుతో గుర్తించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!