

కర్ణాటకలోని బెళగావి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శివం అసోసియేట్స్ సంస్థపై అక్రమ నగదు డిపాజిట్ల సేకరణ ఆరోపణల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన కన్నడ ఉత్సవంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో నటులు డాలి ధనుంజయ, వశిష్ఠ సింహ, సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది పాల్గొనగా, వారికి చెల్లించిన పారితోషికాల వివరాలపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
అదే కేసులో భాగంగా, సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర నిర్మించిన ‘ఛాంపియన్’ చిత్రంలోని ప్రత్యేక గీతంలో నటించిన బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆమెకు రూ.1 కోటి రెమ్యూనరేషన్ చెల్లించినట్లు రికార్డుల్లో గుర్తించిన అధికారులు, ఆ చెల్లింపులపై వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల మూలాలు, చెల్లింపుల వివరాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!