24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

Writer: Chandrika 04:41 PM, 24 జులై, 2026
జనానయాగన్ కు మిశ్రమ స్పందన

దళపతి విజయ్ చివరి చిత్రంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జన నాయగన్’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా చూస్తే ఇది మంచి ఓపెనింగ్ అయినప్పటికీ, విజయ్ స్థాయికి, ఆయన గత చిత్రాల రికార్డులతో పోలిస్తే అంచనాలకు తగ్గట్లుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాకు ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు రావడంతో పాటు సెకండాఫ్, విలన్ ట్రాక్‌పై ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస వాయిదాలు, పైరసీ కూడా తొలిరోజు వసూళ్లపై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

విజయ్‌కు ఉన్న భారీ క్రేజ్‌తో పాటు ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరగడంతో ‘జన నాయగన్’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల మౌత్ టాక్, వీకెండ్ వసూళ్లు సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో కీలకంగా మారనున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!

ట్యాగ్లు
జన నాయగన్దళపతి విజయ్జన నాయగన్ బాక్సాఫీస్విజయ్హెచ్ వినోద్పూజా హెగ్డేమమితా బైజుబాబీ డియోల్తమిళ సినిమాబాక్సాఫీస్ కలెక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు
జనరల్

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!