

సురేష్ కొండేటి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా కథాబలమున్న చిత్రాలను అందించిన సురేష్ కొండేటి ట్రాక్ రికార్డ్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే. పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్, రామికా శివు, తపస్విని పూనాచా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘వెల్‌కమ్ టు ది ల్యాండ్ ఆఫ్ లవ్’ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పచ్చని గ్రామీణ వాతావరణం, విండ్‌మిల్స్, ఎడ్లబండి, ప్రేమ, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంటోంది. హనుమాన్ చౌదరి సంభాషణలు, రాంబాబు గోశాల సాహిత్యం, సునాద్ గౌతమ్ సంగీతం, రాజ్‌కాంత్ ఎస్.కె. ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఎడిటింగ్ హర్షిత్ ప్రభు, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా దేవేంద్ర ఎం. వ్యవహరిస్తున్నారు. సురేష్ కొండేటి గత విజయాల నేపథ్యంలో ‘ప్రేమనే ఊరిలో’పై ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!