
సినిమాలు

సూర్య హీరోగా, సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2008లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. భావోద్వేగభరితమైన కథ, అద్భుతమైన నటనతో ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.
జూన్ 12న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ప్రదర్శనల కోసం ఇప్పటికే దాదాపు 30 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. క్లాసిక్ చిత్రాల రీ-రిలీజ్‌లకు పెరుగుతున్న ఆదరణ మధ్య ఈ సినిమా కూడా మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!