
ఓటీటీ

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 వేడుకకు సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న నామినేషన్ల జాబితాను సైమా కమిటీ విడుదల చేసింది. తెలుగు చిత్రాల విభాగంలో ‘మిరాయ్’ అత్యధికంగా 11 నామినేషన్లు సాధించి ముందంజలో నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ 10 నామినేషన్లతో రెండో స్థానంలో ఉండగా, ‘తండేల్’, ‘కోర్ట్’ చిత్రాలు చెరో 9 నామినేషన్లు దక్కించుకున్నాయి.
ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్(ఓజీ), ధనుష్ (కుబేర), నాని (హిట్ 3), నాగచైతన్య (తండేల్), తేజ సజ్జా (మిరాయ్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) అవార్డు కోసం పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరిగే వేడుకల్లో విజేతలను ప్రకటించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!