
రాజకీయాలు

సీనియర్ నటి ప్రియమణి తెలుగు సహా పలు భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘నారప్ప’ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. రామానాయుడు స్టూడియోలో ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నటించిన హీరోయిన్ల ఫోటోలను చూసినప్పుడు, ఒకరోజు తన ఫోటో కూడా అక్కడ ఉండాలని కలగన్నానని ఆమె వెల్లడించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘నారప్ప’ సినిమాలో నటించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రియమణి తెలిపింది. ఆ చిత్రంలోని తన పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో పాటు, ఆ బ్యానర్లో పనిచేయాలనే కోరిక కూడా నెరవేరిందని చెప్పింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పనితీరును ప్రశంసిస్తూ, ‘నారప్ప’ తన కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచిందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!