

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ది ప్యారడైజ్‌లో జడల్ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాత్ర చిన్ననాటి రూపంలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ అఖిర నందన్ తాజాగా నానితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫొటోలో నాని, అఖిర ఇద్దరూ నవ్వుతూ కనిపించడంతో బడా జడల్, చోటా జడల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఈ క్షణం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అఖిర ఈ ఫొటోకు “Chota Jadal × Jadal × SrikanthSir × Amma = THEPARADISE” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తనకు సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల, హీరో నాని, హీరోయిన్ కయాడు లోహర్, కీర్తి సురేష్‌తో పాటు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. చిన్న వయసులోనే కీలక పాత్రలో నటించి మెప్పించిన అఖిరకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తుండగా, ప్రస్తుతం నానితో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!