

నేచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో పాట ‘యేశ నాగుల’ ఫుల్ వెర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ జానపద నేపథ్యంతో రూపొందిన ఈ పాటకు అనిరుధ్ తనదైన శైలిలో మాస్ టచ్ ఇచ్చారు.
డల్లాస్‌లో నిర్వహించిన లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఈ పాటను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఆ తర్వాత అభిమానుల కోసం అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై వంటి పలు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో పాటను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒరిజినల్ ఫోక్ ఫీల్‌ను కొనసాగిస్తూ అనిరుధ్ అందించిన ఎనర్జిటిక్ బీట్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో నాని సరసన కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!