

2026 ఫస్ట్ హాఫ్ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను పరిశీలిస్తే సంక్రాంతి సినిమాలతో ఏడాది ప్రారంభం నుంచే సందడి కనిపించింది. ఈసారి ఏకంగా ఐదు చిత్రాలు పండుగ బరిలో నిలిచాయి. అందులో మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు కలెక్షన్ల పరంగా మెరుగైన ఫలితాలు సాధించిన సినిమాలుగా నిలిచాయి. రవితేజ నటించిన భక్త మహాశయులకు విజ్ఞప్తి యావరేజ్ టాక్‌ను అందుకోగా, భారీ అంచనాలతో వచ్చిన ది రాజా సాబ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. నారి నారి నడుమ మురారి కూడా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టలేకపోయింది.
సంక్రాంతి తర్వాత చిన్న, మీడియం రేంజ్ సినిమాల విడుదలలు పెరిగినా.. వాటిలో చాలా చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. ఫంకీ, యుఫొరియా, హే బల్వంత్, విష్ణు విన్యాసం, శ్రీ చిదంబరం వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోగా, కపుల్ ఫ్రెండ్లీ ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. మార్చిలో వచ్చిన పలు చిత్రాలతో పాటు శర్వా నటించిన బైకర్ కూడా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో నిలవలేదు. మేలో విడుదలైన గాయపడ్డ సింహం, జెట్లీ, గోదారి గట్టుపైన, అగ్లీ స్టోరీ వంటి సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో భారీ హైప్‌తో వచ్చిన పెద్ది మిశ్రమ సమీక్షల మధ్య మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ రెండో వారం నుంచి వసూళ్లు తగ్గాయి. ఇటీవల సింగీతం, దీవాన డీసెంట్ కలెక్షన్స్ సాధించగా, మా ఇంటి బంగారం మాత్రం బలమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌తో ఫస్ట్ హాఫ్‌లో ప్రత్యేకంగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!