

2026 తెలుగు బాక్సాఫీస్‌లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు భారీ సినిమాల సందడి కొనసాగనుంది. సెప్టెంబర్ 24న నాని నటించిన ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ ఓదెలతో దసరా తర్వాత నాని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ రణబాలి విడుదల కానుంది. అదే సమయంలో అక్టోబర్ 15న జైలర్ 2, అక్టోబర్ 16న ఓం చాప్టర్ 1 కూడా రానుండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో రూ.500 కోట్ల మార్క్ అందుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
క్రిస్మస్ సీజన్‌లో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. అదే తేదీకి నాగార్జున కింగ్ 100 కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాల మధ్య నేరుగా పోటీ ఏర్పడనుంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన కూడా డిసెంబర్‌లోనే వచ్చే అవకాశం ఉంది. విశ్వంభర, మైసా సినిమాలు కూడా 2026లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నా తేదీలు ఖరారు కాలేదు. మరి ఈ సినిమాల్లో బాక్సాఫీస్‌ను ఎవరు షేక్ చేస్తారో ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!