

ఒకప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖ హీరోగా గుర్తింపు పొందిన వడ్డే నవీన్, దాదాపు పదేళ్ల విరామం తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా తన వ్యక్తిగత జీవితం, ఫిట్‌నెస్ మరియు ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక గంట వాకింగ్, జిమ్ చేస్తానని, టిఫిన్‌కు బదులుగా నేరుగా చికెన్ లేదా వెజ్ కర్రీతో రైస్ తింటానని వెల్లడించారు.
వడ్డే నవీన్ చేసిన మరో వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తాను మధ్యాహ్నం లంచ్ చేయనని, రాత్రి భోజనంలో కూడా నాన్‌వెజ్‌తో పాటు వెజ్ ఫుడ్ తీసుకుంటానని చెప్పారు. సాధారణంగా రోజులో ఒకపూట భోజనం మానేయడం చాలా కష్టమని భావించే వారికి ఆయన రొటీన్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించగా, కల్యాణ్ నాయక్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!