

సినిమా విడుదలైన తర్వాత వసూళ్లు సాధించడం ఒక ఎత్తయితే, విడుదలకు ముందే భారీ మొత్తంలో వ్యాపారం చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో రాజమౌళి తనదైన వ్యూహాలతో ముందుంటారు. షూటింగ్ పూర్తయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి కాకుండా, సినిమా ప్రకటించినప్పటి నుంచే వ్యాపారానికి బలమైన పునాది వేస్తారు. ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి విషయంలోనూ ఇదే జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే థియేట్రికల్ హక్కుల వ్యవహారం కొలిక్కి రావడంతో ఇతర హక్కులపై ఆసక్తి పెరిగింది. ఓవర్సీస్ మినహా మిగతా ప్రాంతాల థియేట్రికల్ హక్కులు ఏకంగా 300 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయట. ఆర్‌ఆర్‌ఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు నేపథ్యంలో వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 700 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మహేశ్ బాబుతో పాటు హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుండటం మరో ఆకర్షణ. సాహసం, యాక్షన్, పురాణ నేపథ్యం, భావోద్వేగాలతో రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌ను విడుదలకు ముందే రాబట్టే దిశగా వ్యాపారం సాగుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!