

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ చిత్ర సంగీత ప్రయాణం ‘ఎందయ్యా సామీ’ పాటతో ఘనంగా ప్రారంభమైంది. ఐదు భాషల్లో ఈ పాట నేడు విడుదలైంది. 19వ శతాబ్దపు సంప్రదాయ వివాహ వేడుకల నేపథ్యంలో రణబాలి, జయమ్మల ప్రేమకథను ఈ పాట పరిచయం చేస్తోంది. పండుగ వాతావరణం, సంప్రదాయ కళా వైభవం, ప్రేమానుభూతులతో పాట విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రష్మిక జయమ్మ పాత్రలో అందంగా కనిపించగా, విజయ్ దేవరకొండ రణబాలిగా ఆత్మీయత, ప్రేమను చాటుకున్నారు.
అజయ్–అతుల్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి శ్వేతా మోహన్, అజయ్ గోగావలే గాత్రం అందించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం పెళ్లి తర్వాత ఒక్కటైన రెండు మనసుల భావాలను చక్కగా ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే చిన్న ప్రోమోతో ఆసక్తిని పెంచిన ‘ఎందయ్యా సామీ’ పూర్తి పాటతో మరింత ఆకట్టుకుంటోంది. దీంతో ‘రణబాలి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!